మణుగూరు, సెప్టెంబర్ 12 (Y7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం గ్రామంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షాహిన్ మాట్లాడుతూ కుల, మత భేదాలకు అతీతంగా విద్యార్థులను చిన్ననాటి నుంచే అన్ని మతాలను గౌరవించే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ భాస్కర్ రెడ్డి, ప్రైమరీ ఇన్‌చార్జి నస్రీన్, పీపీటీ ఇన్‌చార్జి వెంకటరమణతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








