E-PAPER

నాయీబ్రాహ్మణులు అత్మగౌరవ పోరాటాలకు సిధ్దం కావాలి,

క్షౌర వృత్తి లోకి కార్పోరేట్ ఆగమనాన్ని అడ్డుకోవాలి,

ఆలయాలు, జాతరలలో ఉధ్యోగాలు, తలనీళాల ఆధాయంలో వాటాల సాధనకోసం పోరాటాలకు సిధ్దం కావాలి

తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం వెంకటాపురం మండల మహసభ శనివారం గౌరవ, అధ్యక్షతన కొయ్యల వెంకటేశ్వర్లు,మోహన్ రావు నిర్వహించరు. ఈ కార్యక్రమానికిముఖ్య అథిధి గా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జంపాల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకే సంఘంగా మారవలసిన సమయం ఆసన్నమైందిని అన్నారు. ఆదిపత్యాలకోసం సంఘాలను విభజించడానికి ఇది రాజకీయ పార్టీ కాదు అనేవిషయం అర్ధం చేసుకోవాలని సూచించారు. హక్కులు, ఆత్మగౌరవ భవణాలు సాధించుకోక పోవడానికి కారణం కూడా అనేక సంఘాలుగా ఉండడమే అన్ని అన్నారు. ఐక్యం కావడానికి ఈనెల 15న ములుగు జిల్లా కేంద్రంగా జరిగే జిల్లా మహసభ వేధిక కావాలని అందకు అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు సిధ్దం కావాలని కోరారు. సకలసామాజిక రంగాలలో మేమెంతో మాకంత వాటా అనే నినాదం తో ముందుకు సాగవలసిన అవసరం ఉంది అన్నారు. ఇంకా అనేక హక్కులు సాదించుకునే దిశగా పోరాటాలకు సిధ్దంకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆహ్వాన కమిటీ అధ్యక్షులు జంపాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చెన్న కుమార్, యువజన నాయకులు చిక్కల వెంకటేష్ వాజేడు మండలం అధ్యక్షులు సిరిమర్తి మల్లికార్జున్, వాజేడు ప్రధాన ముక్కెర రాజశేఖర్, ఉపాధ్యక్షుడు బద్దెల సత్యనారాయణ, కొయ్యల శివ, కొయ్యల ప్రశాంత్ కొయ్యల శ్రీకాంత్, కొయ్యల పవన్, రావులపాటి రాజు, కొట్నాల రమేష్, కొట్నాల సాయి, రావులపాటి నరసింహారావు, పాలడుగు ప్రసాద్, అందుర్తి రవితేజ, ములుకుట్ల వివేక్, రావులపాటి రాంబాబు, పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!