శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ సెప్టెంబర్ 12
పలాస జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి మాధురి మాట్లాడుతూ, రాజీ కుదిరే సివిల్ మరియు క్రిమినల్ కేసులను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొంటూ “రాజీ మార్గమే రాజమార్గం” అని అన్నారు.దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Post Views: 16








