భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 11 (వై7 తెలుగు న్యూస్):
కరకగూడెం మండలంలోని సమత్ బట్టుపల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గత ఆరు సంవత్సరాలుగా వైఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతిని కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మట్టి విగ్రహాల తయారీలో పాల్గొనడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హితమైన గణేష్ ఉత్సవాలను నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సహకరిస్తుండటం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్
కరకగూడెం మండలం








