
పలాస, సెప్టెంబర్ 11 (వై7 న్యూస్):
పలాస నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం పలాసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ (గ్రీవెన్స్) కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, పింఛన్లు, తాగునీరు, మౌలిక వసతులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే, సమస్యల స్వరూపాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని, ప్రతి అర్జీపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.








