E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రులకు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెడ్ షీట్స్ పంపిణీ

చింతూరు, ఆగస్టు 21 (వై7 న్యూస్): పేదలు, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటికి అవసరమైన సహకారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, చింతూరు మండల టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ అన్నారు.

జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), ఎటపాక మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) బెడ్ షీట్స్, పిల్లో కవర్లు అందజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ, పేదలు మరియు గిరిజనులు ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా తమ ట్రస్ట్ తరఫున చేతనైన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించడం తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గతంలో కూడా జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలు, గిరిజన కుటుంబాలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించామని, భవిష్యత్తులో విద్య, వైద్యం, పేదల సంక్షేమం, అత్యవసర సహాయం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన సామగ్రిని అందించిన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. అందించిన సామగ్రిని రోగుల సౌకర్యార్థం సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వచైతన్య, డాక్టర్ రాజశేఖర్, ఎటపాక మండల టీడీపీ కార్యదర్శి కణితి మధు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!