పినపాక; పినపాక నియోజకవర్గ రాజకీయాల్లో దశాబ్దాలుగా రెండు పేర్లే వినిపిస్తున్నాయి. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఎన్నికలు మారినా, పార్టీలు మారినా రాజకీయ సమీకరణాలు మాత్రం ఈ ఇద్దరి చుట్టూనే తిరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోందా..? పినపాక రాజకీయాల్లో కొత్త ముఖం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారా..? యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలో చర్చ మొదలైందా..? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
“ఇద్దరినీ చూశాం… ఇప్పుడు మూడో నాయకుడికి అవకాశం ఇవ్వాలి” అనే అభిప్రాయం కొందరు ప్రజల నుంచి వినిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పినపాక రాజకీయాల్లో కొత్త శక్తి ఆవిర్భవిస్తుందా..? లేక మళ్లీ పాత నేతల మధ్యే పోటీ కొనసాగుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
మూడో నేత ఎవరూ..? ప్రజల ఆశలకు ప్రతినిధిగా కొత్త నాయకత్వం వస్తుందా..? పినపాక రాజకీయాల్లో త్వరలోనే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా..? అనే చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.








