ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారత మార్కెట్లో తన కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. iQOO Z11 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను “Faster, Smarter with AI” అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ పరిచయం చేసింది. ఆధునిక డిజైన్, స్మార్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించింది.
ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని iQOO Z11లో పలు AI ఆధారిత ఫీచర్లను అందించారు. చదువులు, నోట్స్ తయారీ, కంటెంట్ నిర్వహణ వంటి పనులను మరింత సులభంగా పూర్తి చేసుకునేందుకు AI ఆధారిత ప్రొడక్టివిటీ, స్టడీ ఫీచర్లు ఉపయోగపడనున్నాయి.
రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, స్మార్ట్ అసిస్టెన్స్ వంటి అంశాలపై కూడా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో విద్యార్థులు, యువతకు ఉపయోగపడే ఫీచర్లతో వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్‌గా iQOO Z11 మార్కెట్లో ఆసక్తిని పెంచుతోంది.








