బూర్గంపాడు, ఆగస్టు 6 (వై7 న్యూస్): ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ఆదివాసి 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.
ఆదివాసి 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ (డీఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బూర్గంపాడు మండల జేఏసీ, ఆదివాసి సంఘం మండల అధ్యక్షుడు తాటి సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఆదివాసి గూడెంలో ఆదివాసి జెండాను ఎగరవేసి, కొత్తగూడెం కేంద్రంలో నిర్వహించే ఆదివాసి సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న ఆదివాసి పెద్దలు, ఉద్యోగులు, సర్పంచులు, యువత ఆగస్టు 9న మండలంలోని ప్రతి ఆదివాసి గ్రామంలో ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు పోడియం నరేందర్, ముసలమడుగు సర్పంచ్ పూణెం సురేందర్, మాజీ సర్పంచ్ కుర్సం వెంకన్న, నకిరేపేట సర్పంచ్ చర్ప వెంకటేశ్వర్లు, కనితి దేవా ప్రసాద్, సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, నకిరేపేట గ్రామ పెద్దలు తాటి సారయ్య, తాటి వెంకటేశ్వర్లు, గుండి బాలరాజు, కల్లూరి చలపతిరావు, రామాపురం తాటి దానియేలు, జిన్నగట్టకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.








