E-PAPER

ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. తల జుట్టు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముకుంటున్న ప్రజలు

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా ప్రజల జీవన పరిస్థితులు మరింత కష్టంగా మారడంతో.. అదనపు ఆదాయం కోసం పలువురు తమ వ్యక్తిగత వస్తువులను విక్రయిస్తున్నారు. తల జుట్టు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, పాత వస్తువులతో పాటు ల్యాప్‌టాప్‌లను సైతం కొంతకాలానికి అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం.

ఆన్‌లైన్ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాడిన దుస్తులు, పనికి ఉపయోగించే బూట్లు, వాడిన పెర్ఫ్యూమ్ సీసాలు, సహజమైన జుట్టుకు సంబంధించిన ప్రకటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హెయిర్ ఎక్స్‌టెన్షన్ల తయారీలో ఉపయోగించే సహజమైన తల జుట్టుకు డిమాండ్ ఉండటంతో.. ప్రజలు తమ జుట్టును విక్రయిస్తున్నారు. జుట్టు పొడవు, రంగు, నాణ్యత ఆధారంగా దాని ధర మారుతున్నట్లు తెలుస్తోంది.

ఇక వాడిన పెర్ఫ్యూమ్ బాటిళ్లకు కూడా కొనుగోలుదారులు లభిస్తున్నారు. ఒకప్పుడు విలువలేనివిగా భావించిన వస్తువులు సైతం ఇప్పుడు ఇరాన్ ప్రజలకు ఆదాయ మార్గాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రజలు తమ వద్ద ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!