E-PAPER

‘లెనిన్’ ఓటీటీ ఎంట్రీ.. ఆగస్ట్ 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్!

అఖిల్ అక్కినేని హీరోగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ‘లెనిన్’ ఆగస్ట్ 7 నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. 90ల కాలం నాటి చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగుతున్న ఈ కథలో రామచంద్రాపురం గ్రామం, అక్కడ జరిగే 18 రోజుల ద్రౌపదమ్మ జాతర కీలకంగా నిలుస్తాయి. ఈ సమయంలో గ్రామంలో రక్తపు చుక్క కూడా చిందకూడదనే ఆచారం ఉంటుంది. అదే సమయంలో అనాథ అయిన లెనిన్ గ్రామంలోకి అడుగుపెట్టడం, ఈశ్వరీరావు మరియు ఆమె కుమారుడు ప్రమోద్ పంజు అతన్ని ఆదరించడం, ఆ తర్వాత అఖిల్–ప్రమోద్ స్నేహం, భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమకథ వంటి అంశాలు కథను ఆసక్తికరంగా నడిపిస్తాయి.

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో లెనిన్ జైలుకు వెళ్లాల్సి రావడం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకున్నాడనే అంశాలు సినిమాకు ప్రధాన ఉత్కంఠను తీసుకొస్తాయి. అఖిల్ రా అండ్ రస్టిక్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా, భాగ్యశ్రీ బోర్సె తన గ్లామర్‌తో పాటు అభినయంతో మెప్పించారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కథ, కథనం, టేకింగ్‌కు తోడు తమన్ మాస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!