E-PAPER

టవల్ ఉతికినా దుర్వాసన వస్తుందా? కారణాలు, పరిష్కారాలు ఇవే

టవల్‌ను ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుండటం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. దీనికి టవల్ పాతబడటమే కారణమని అనుకునే వారు ఉన్నా, వాస్తవానికి టవల్‌ను ఉతికే విధానం, ఆరబెట్టే పద్ధతి, అలాగే వాషింగ్ మెషీన్ పరిశుభ్రత వంటి అంశాలే ప్రధాన కారణాలు.

టవల్స్‌ను శరీరంపై ఉన్న నీరు, చెమటను తుడుచుకోవడానికి ఉపయోగిస్తాం. దీంతో వాటిపై తేమ, శరీరంలోని సహజ నూనెలు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. టవల్ పూర్తిగా ఆరకపోతే బ్యాక్టీరియా, బూజు పెరిగి దుర్వాసన ఏర్పడుతుంది. ముఖ్యంగా తడిగా ఉన్న టవల్‌ను మడతపెట్టి ఉంచడం లేదా గాలి తగలని చోట వేలాడదీయడం సమస్యను మరింత పెంచుతుంది.

అలాగే ఎక్కువ డిటర్జెంట్ వాడితే టవల్ మరింత శుభ్రంగా అవుతుందని భావించడం కూడా తప్పు. అధిక డిటర్జెంట్ టవల్ ఫైబర్లలోనే మిగిలిపోయి మురికి, తేమను బంధిస్తుంది. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ అధికంగా వాడటం వల్ల కూడా టవల్‌పై ఒక పొర ఏర్పడి నీటిని సరిగా పీల్చుకోకుండా చేస్తుంది. కాబట్టి టవల్స్‌ను తక్కువ డిటర్జెంట్‌తో ఉతికి, పూర్తిగా ఎండలో ఆరబెట్టి, వాషింగ్ మెషీన్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News