ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ S26 సిరీస్‌ను విడుదల చేసిన శాంసంగ్, ఇప్పుడు రెండో Galaxy Unpacked 2026 ఈవెంట్‌కు సిద్ధమైంది. జూలై 22న లండన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కంపెనీ తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్ లండన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు కంపెనీ యూట్యూబ్ ఛానెల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ వేడుకలో Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Flip 8 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు Galaxy Watch 9, Galaxy Watch Ultra 2, అలాగే శాంసంగ్ తొలి స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేసే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Post Views: 3








