E-PAPER

మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం పర్యటనను విజయవంతం చేయాలి

కాంగ్రెస్ నాయకుల పిలుపు

మణుగూరు, జూలై 18 (వై7 న్యూస్): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

శనివారం మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీరినాకి నవీన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కురం రవి మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గంలోని మూడు మండలాల్లో రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా గుట్టమల్లారం బీటీ రోడ్డు నిర్మాణం, సమితి సింగారం – లంకమల్లారం మధ్య కోడిపుజుల వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, ఐఎన్‌టీయూసీ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ పాలమూరి రాజు, జిల్లా కార్యదర్శి దొబ్బల వెంకటప్పయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బోనగిరి శివసైదులు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, సమితి సింగారం ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, గణేష్ రెడ్డి, ఎండీ రహీమ్ పాషా, దేశబోయిన లవకుమార్, ఊకె కృష్ణవేణి, స్వరూప, రమ, దేవి, మంగ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!