E-PAPER

అశ్వాపురం మండలంలో ఎరువుల దుకాణాల తనిఖీలు

అశ్వాపురం , జూలై 15 (వై 7 న్యూస్);

నాణ్యత పరీక్షల కోసం ఎరువుల నమూనాల సేకరణ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి మండల పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (FCO) నిబంధనల ప్రకారం వివిధ రకాల ఎరువుల నమూనాలను సేకరించి నాణ్యత విశ్లేషణ నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు.తనిఖీల సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు మరియు ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఎరువుల విక్రయదారులు అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు ఎరువుల విక్రయ సమయంలో తప్పనిసరిగా బిల్లు జారీ చేయాలని మండల వ్యవసాయ అధికారి ఆదేశించారు.అలాగే ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (MRP) కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించరాదని, నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ఎరువుల విక్రయం, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్, 1985 మరియు సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని తెలిపారు…

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News