చింతూరు జూలై 15 , వై7 న్యూస్;
పోలవరం జిల్లా,చింతూరు మండలం, ఏడుగురాళ్లపల్లి పంచాయతీ లోని చల్లకవ్వం, ఉప్పనపల్లి గట్టు, చింతపల్లి,వేగిసగండి, తేనె రాయి,పెద్దవాగు, విటుకా పాడు, కొండా రెడ్ల గ్రామస్థులు మరియు వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన ప్రజా పిర్యాదుల సమావేశంలో ఐటిడిఏ పీఓ శుభం నొక్వల్ ను కలిసి తాటిలంక క్రాస్ రోడ్ నుండి ఉప్పన పల్లి గట్టు వరకు సుమారు 5 కిలో మీటరు మేర రహదారి నిర్మాణ పనులు మంజూరు కొరకు , నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. పూర్తిగా ఆదివాసీ కొండా రెడ్ల గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి వెంటే రాకపోకలు సాగిస్తుంటారు, సరియిన రహదారి లేక అత్యవసర వైద్యం సేవలు అందడం లేదు అని, గత నెల 7 వ తేదీన ఒక రెండు సంవత్సరాల పాప పాము కాటుకు గురై చనిపోయిన విషయం ఆదివాసులు పీఓ దృష్టికి తీసుకొని వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ రాజ్ డి.ఇ పిలిచి ఈ విషయం పై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. పిఓ శుభం నొక్వల్ స్పందనకు ఆదివాసీ కొండా రెడ్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచ్ సవలం సత్తిబాబు,మాజీ ఉప సర్పంచ్ బి బాబురావు, గ్రామస్థులు, కదల సుధాకర్ రెడ్డి,కదల కొండ రెడ్డి, ఎర్ర రెడ్డి, బిమిరెడ్డి, కదల గంగి రెడ్డి,ఉయిక బాబు, మహేష్, దుర్గారావు, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.








