E-PAPER

రూ.420 కోట్లకు అమ్ముడైన టీ-రెక్స్ శిలాజం.. కొనుగోలుదారు ఎవరో సస్పెన్స్

భూమిపై కోట్లాది సంవత్సరాల క్రితం సంచరించిన డైనోసార్లలో అత్యంత భయంకరమైన జీవిగా పేరొందిన టైరన్నోసారస్ రెక్స్ (టీ-రెక్స్) శిలాజం అంతర్జాతీయ వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్‌లోని ప్రముఖ సోథెబీస్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ అరుదైన శిలాజం ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.420 కోట్లకు అమ్ముడైంది.

దాదాపు 6.7 కోట్ల సంవత్సరాల నాటి ఈ టీ-రెక్స్ అస్థిపంజరం ఇప్పటివరకు ఏ డైనోసార్ శిలాజానికీ లభించని అత్యధిక ధరను నమోదు చేసింది. చరిత్రలో ఒక డైనోసార్ అస్థిపంజరం కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది. దీంతో ఈ వేలం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే ఈ విలువైన టీ-రెక్స్ శిలాజాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలను సోథెబీస్ వెల్లడించలేదు. దీంతో అంత భారీ మొత్తాన్ని వెచ్చించిన కొనుగోలుదారు ఎవరు అనే విషయం ప్రస్తుతం మిస్టరీగా మారింది. శాస్త్రవేత్తలు, చరిత్ర ప్రేమికులు, పురావస్తు నిపుణుల దృష్టిని ఈ రికార్డు వేలం ఆకర్షిస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News