E-PAPER

గుండు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా?.. వైద్య నిపుణులు చెప్పిన నిజం ఇదే

చిన్నప్పటి నుంచి గుండు చేయించుకుంటే జుట్టు మరింత ఒత్తుగా, బలంగా పెరుగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అందుకే పిల్లలకు చిన్న వయసులోనే గుండు చేయించడం, పెద్దయ్యాక జుట్టు పలచబడితే మళ్లీ షేవ్ చేయించుకోవడం వంటి పద్ధతులను కొందరు అనుసరిస్తుంటారు. అయితే నిజంగా గుండు చేయించుకోవడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుందా అనే ప్రశ్నకు వైద్య నిపుణులు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

నిపుణుల ప్రకారం, జుట్టును పూర్తిగా షేవ్ చేయడం లేదా తరచూ కత్తిరించడం వల్ల అది మరింత ఒత్తుగా లేదా వేగంగా పెరుగుతుందనే విషయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా జన్యుపరమైన లక్షణాలు, హార్మోన్లు, పోషకాహారం, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. షేవింగ్ వల్ల వెంట్రుకల సంఖ్య లేదా మందం పెరగదని వారు చెబుతున్నారు.

షేవ్ చేసిన తర్వాత కొత్తగా పెరిగే వెంట్రుకల చివరలు సమంగా ఉండటం వల్ల అవి గరుకుగా, మందంగా కనిపిస్తాయి. దీంతో చాలామందికి జుట్టు ఒత్తుగా పెరిగిందనే భావన కలుగుతుంది. కానీ ఇది కేవలం కళ్లకు కనిపించే భ్రమ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే సమతుల్య ఆహారం, సరైన హెయిర్ కేర్, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News