E-PAPER

అఖిల్ ‘లెనిన్’కు గట్టి పోటీ.. జూలై 10న బాక్సాఫీస్ వార్!

 

‘ఏజెంట్’ తర్వాత గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్, ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తొలుత మే 1న విడుదల కావాల్సిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జూన్ 26కు వాయిదా పడగా, ఆ తర్వాత మరోసారి తేదీ మారి ఇప్పుడు జూలై 10న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈసారి అఖిల్‌కు సోలో రిలీజ్ దక్కడం లేదు. అదే రోజున పలువురు హీరోల సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది.

మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ నో బడీ’ కూడా జూలై 10న తెలుగులో విడుదల కానుంది. శ్రీ శ్రవంతి మూవీస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. మరోవైపు కోలీవుడ్ హీరో అధర్వ మురళి నటించిన ‘హృదయం మురళీ’ కూడా అదే రోజు విడుదల కానుంది. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడు తమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా తెరకెక్కిన ‘లవ్ ఓ లవ్’, ఇందులో తెలుగు యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే మాస్టర్ మహేంద్రన్ నటించిన ‘వసుదేవ సుతం’ కూడా జూలై 10న విడుదల కానుంది. దీంతో అఖిల్ ‘లెనిన్’కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుండగా, ప్రేక్షకుల ఆదరణ ఏ సినిమాకు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!