పలాస, ఆగస్టు 26 (వై7 న్యూస్):
పలాస పరిధిలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. పలాస రైల్వే కాలనీలోని మూడో లేన్ జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 32.590 కిలోల గంజాయి, మూడు స్మార్ట్ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు మరియు ఒక బాలుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 7








