E-PAPER

ఇరాన్‌పై అమెరికా దాడులకు నాటో మద్దతు.. మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు

 

ఇరాన్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడులకు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే బహిరంగ మద్దతు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిన నేపథ్యంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు పూర్తిగా అవసరమైనవేనని ఆయన వ్యాఖ్యానించారు. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య ట్యాంకర్లపై దాడులు జరిగిన అనంతరం అమెరికా ఇరాన్ సైనిక స్థావరాలపై మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. అదే సమయంలో ఇరాన్‌కు చమురు విక్రయాలకు అనుమతిస్తున్న ప్రత్యేక లైసెన్స్‌ను కూడా అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలు ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందంపై మరింత ఉద్రిక్తతను పెంచాయి.

హార్ముజ్ జలసంధిలో జరిగిన నౌకలపై దాడులకు ఇరానే బాధ్యత వహించాలని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారగా, అమెరికా చర్యలకు నాటో మద్దతు ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News