పలాస, జూలై 8 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా నౌపాడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎం. సోమేశ్వరరావు బుధవారం తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. మృతుడి చేతిపై హిందీలో “శేఖర్” అనే పేరు పచ్చబొట్టు రూపంలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన బంధువులు లేదా సంబంధిత వ్యక్తులు నౌపాడ రైల్వే పోలీసులను సంప్రదించాలని జీఆర్పీ అధికారులు కోరారు.
Post Views: 20









