శ్రీకాకుళం జిల్లా, పలాస | వై7న్యూస్ | జూలై 5
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ కాటమ్మ తల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 11








