E-PAPER

అశ్వాపురంలో పట్టపగలు చోరీ.. రూ.50 వేల నగదు అపహరణ

అశ్వాపురం, జూలై 3 (Y7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పట్టపగలు దొంగతనం చోటుచేసుకుంది. ఉషోదయ స్కూల్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న తేజవత్ సొమ్లనాయక్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.

సొమ్లనాయక్ దంపతులు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా, ఇంట్లోని బీరువా పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, బీరువాలో దాచిన రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు.

పట్టపగలు జరిగిన ఈ చోరీ స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. దొంగలు ఎప్పుడు వచ్చారు, ఎలా వెళ్లారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై బాధితులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News