చర్ల, జూన్ 28:
భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఆదివారం చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళి హాజరయ్యారు. సీనియర్ నాయకులు గుండెపూడి భాస్కర్ రావు, లంక రాజు, సత్తిబాబు, రాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశాన్ని ప్రపంచీకరణ దిశగా నడిపించిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పోలిన లంక రాజు, గోగాలా సంధ్య, కానీతి శిరీష, కాక శ్రీవిద్య, మచ్చ వరలక్ష్మి, యాడిలా సుజాత, శివ, సంపత్, హర్ష, రెడ్డి, బాట బాలకృష్ణ, రాకేష్, బాబీ, సాగర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ తమ్మళ్ళ








