దుమ్ముగూడెం, జూన్ 27 (వై7 న్యూస్):
దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు పూసం దాసు శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడం, గ్రామ పంచాయతీలో సంక్షేమ పథకాల అమలులో స్థానిక కాంగ్రెస్ నాయకుల జోక్యం వల్ల అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందడం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీ మారినట్లు తెలిపారు. అలాగే స్థానిక నాయకుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న బీఆర్‌ఎస్ నాయకత్వం మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు.
భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసన మండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీంద్ర కుమార్, బీఆర్‌ఎస్ నాయకుడు తాత మధుసూదన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కణితి రాముడు, రేసు లక్ష్మి, తునికి కామేశ్వరరావు, వాగే కృష్ణ, మడకం భూపతిరావు, ఉడుగుల నిరీక్షణరావు, కుమారికుంట్ల సూర్య తదితరులు పాల్గొన్నారు.








