కల్పవృక్ష నారసింహుని దయతో ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలి…మంత్రి తుమ్మల
రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డా.కృష్ణ చైతన్య స్వామి సేవలు అభినందనీయం..మంత్రి తుమ్మల
భూవరాహ యజ్ఞం భద్రగిరి లో నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే తెల్లం
భద్రాచలం జూన్ 27
నేలతల్లిని నమ్మిన ఏ ఒక్కరైతు కంటనీరు పెట్టకూడదని ….
దేశానికి అన్నం పెట్టే రైతే రాజు కావాలని భద్రాద్రి పుణ్యక్షేత్రంలోని కల్పవృక్ష నారసింహ స్వామి వారి దివ్య సన్నిధిలో నృసింహ ఉపాసకులు డా. కృష్ణ చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భూవరాహ మహాయజ్ఞం ఆధ్యాత్మికత, వ్యవసాయ సంస్కృతి, రైతు సంక్షేమానికి ప్రతీకగా నిలిచింది. భూమిని భరించి రక్షించిన భూవరాహ స్వామి అనుగ్రహంతో ప్రతి రైతు కుటుంబం సిరిసంపదలతో వర్ధిల్లాలని, పంటలు పుష్కలంగా పండాలని వేలాది మంది రైతులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “కల్పవృక్ష నారసింహుని దయతో ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని నేలతల్లిని నమ్ముకున్న ఏ ఒక్క రైతు కన్నీరు పెట్టకూడదని . దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన రాజు అని రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని అన్నారు
రామయ్య నడయాడిన పుణ్యక్షేత్రంలో భూవరాహ యజ్ఞం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఈ యజ్ఞం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రకృతి అనుగ్రహంతో పంటల సమృద్ధిగా పండాలని ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని కోరారు యజ్ఞానంతరం పంపిణీ చేసిన మృత్తికా ప్రసాదం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు, భక్తులు తరలివచ్చారు. ఈ పవిత్ర మట్టిని తమ తమ పంట పొలాలలో జల్లుకొని సిరుల పంటలు పండించుకోవాలని రైతు ప్రగతే దేశ ప్రగతి అని అన్నారు.
భూమిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిలో రైతు కేవలం అన్నదాత మాత్రమే కాదు… దేశ భవిష్యత్తును నిర్మించే యజ్ఞకర్త అని . భూవరాహ స్వామి కృపతో ప్రతి పొలం పచ్చగా కళకళలాడాలని, ప్రతి రైతు ఇంట ఆనందం నిండాలని, రైతే రాజుగా వెలిగే స్వర్ణయుగం రావాలని భద్రగిరి నుంచి చేసిన ఈ మహా ప్రార్థన దేశమంతటా సస్యశ్యామలాన్ని విరజిమ్మాలని అన్నారు..యజ్ఞవేదిక వద్ద నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
భూమిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిలో రైతు కేవలం అన్నదాత మాత్రమే కాదు… ప్రతి గింజలో జీవాన్ని నింపే యజ్ఞకర్త అని . రైతు చెమటతోనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని కల్ప వృక్షం నరసింహ స్వామి వారి దయతో ప్రతి రైతు కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు .రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు… దేశ భవిష్యత్తుకు సంబంధించిన మహాసంకల్పం.
భూవరాహ మహాయజ్ఞం ద్వారా వెలువడిన సందేశం ఒక్కటే… భూమిని కాపాడాలి… రైతును గౌరవించాలి… వ్యవసాయాన్ని పరిరక్షించాలి. భూవరాహ స్వామి అనుగ్రహంతో ప్రతి రైతు ఇంట ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి పొలం బంగారు పంటలతో కళకళలాడాలని, ఏ రైతు అప్పుల బాధతో కన్నీరు పెట్టుకోని సమాజం నిర్మితమవాలని, రైతే రాజుగా వెలిగే స్వర్ణయుగం ఆవిష్కృతం కావాలని భద్రగిరి గడ్డపై జరిగిన ఈ మహా యజ్ఞం దేశమంతటికీ స్ఫూర్తిగా నిలిచింది. నేటి ఆధునిక కాలంలో రైతు శ్రేయస్సు కోసం అహిర్నిశలు శ్రమించి 32 దివ్య క్షేత్రాలు నుండి మట్టిని సేకరించి ప్రత్యేక పూజలు చేసి భూ వరాహ యజ్ఞం చేసి ఆ మట్టి ప్రసాదాన్ని రైతులకు అందించిన నృసింహ ఉపాసకులు డా.కృష్ణ చైతన్య స్వామిని ప్రత్యేకంగా తుమ్మల అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు పార్టీ శ్రేణులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు








