E-PAPER

భద్రాచలంలో జూలై 12 మాలల మహా ర్యాలీని విజయవంతం చేయాలి

రోస్టర్ లొ మాలాలకు సముచితస్థానం కల్పించాలి

జిల్లా ఇంచార్జ్ దామాల సత్యం,,అల్లాడి పౌలరాజ్

భద్రాచలం, జూన్ 27:

భద్రాచలం మాలమానాడు యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో జూలై 12న భద్రాచలంలో నిర్వహించనున్న మాలల మహా ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాలమానాడు నాయకులు దామాల సత్యం ,పౌల్రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే మాలల హక్కులు, అవకాశాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాబట్టి మాల సమాజం అంతా ఐక్యంగా ముందుకు వచ్చి, జూలై 12న భద్రాచలంలో నిర్వహించనున్న మాలల మహా ర్యాలీ, మహాసంగ్రామాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలమానాడు యూనిట్ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్‌రాజ్, , జిల్లా నాయకులు బుయ్యన వీరబాబు, పోలవరం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కురినాల వెంకటేశ్వర్లు , పోలవరం జిల్లా కార్యదర్శి వరదా బ్రహ్మం, రిటైర్డ్ అధికారి నూకబోయిన నర్సింహా కార్యదర్శి వరదా సాయి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News