E-PAPER

కవిటి తీరంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.70 లక్షల ఆస్తి నష్టం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కర్రివాణిపాలెం గ్రామ తీరంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 150కి పైగా చేపల వేట వలలు, రెండు మాల బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News