వై 7 న్యూస్ పలాస (నరసన్నపేట):
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు శనివారం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులు తయారుచేసిన ప్రత్యేక ఓవర్ కోట్ను ధరించి ఆకట్టుకున్నారు. ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిన ఈ ఓవర్ కోట్ను సీఎం పరిశీలించి అభినందించారు.నరసన్నపేటలో ఏర్పాటు చేసిన సవర ఆర్ట్స్ గ్యాలరీని సీఎం సందర్శించారు. గిరిజన కళాకారులు తయారుచేసిన వస్త్రాలు, హస్తకళలను పరిశీలించిన ఆయన, ఓవర్ కోట్ సాంప్రదాయబద్ధంగా ఉండటంతో పాటు చల్లగా కూడా ఉంటుందని ఐటిడిఏ పీఓ సీఎంకు వివరించారు.ఈ సందర్భంగా గిరిజన కళాకారుల ప్రతిభను ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు, గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Post Views: 21








