E-PAPER

పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం ; ఒడియా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం

వై 7 న్యూస్ పలాస:
ఈ ఏడాది పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన ఒడియా బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులకు కాశీబుగ్గ జై జగన్నాథ ఒడియా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘన సన్మానం నిర్వహించారు. పూజారి వీధిలోని బ్రాహ్మణ సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి మెమెంటోలు అందజేశారు.పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఒడియా విద్యార్థుల్లో 550 మార్కులకు పైగా సాధించిన 11 మంది విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించినట్లు సంఘ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ తడి, కార్యదర్శి బాబురావు పంట, సభ్యులు శశికుమార్ బ్రహ్మ, కైలాస్ దాస్, రాధాకృష్ణ పండా, రాముపండా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News