అశ్వాపురం:
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డితో కలిసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధరల పెంపుపై హెచ్చరించారని, ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తురుమలగూడెం సర్పంచ్ కుంజా జాన్, సీతారామపురం సర్పంచ్ సప్కా పిచ్ఛయ్య, బట్టీలగుంపు సర్పంచ్ సరిత, అమెర్ద గ్రామ ఉపసర్పంచ్ అంజిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాక రాములు, కందుల లక్ష్మణ్, బారాజు సంపత్, మాదినేని రాంబాబు, వెంకటేశ్వర్లు, వేముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.








