E-PAPER

తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దొంగలు..

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస నగర్‌లో భారీ చోరీ జరిగింది. హేమశంకర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదును అపహరించినట్లు బాధితుడు హేమశంకర్ తెలిపారు.వేసవి సెలవుల కారణంగా కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లిన సమయంలో అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదయం ఇరుగు పొరుగు వారు ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి వెంటనే ఇంటి యజమానికి, కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీంతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News