మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాను 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో విజువల్ స్పెక్టకిల్‌గా నిలవనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. విడుదల తేదీపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.








