వై 7 న్యూస్
పలాస మండలం రామకృష్ణాపురం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ అన్న భక్తుల వెంకటరమణ (63) మృతి చెందారు.
రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న కాశిబుగ్గ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Post Views: 6








