E-PAPER

సజ్జల సంచలన వ్యాఖ్యలు.. అమరావతి పేరుతో అవినీతి జరిగిందని ఆరోపణలు

 

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని నిర్మాణంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి ప్రాజెక్టు ప్రజల అవసరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం రూపొందించబడిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో అమరావతి పేరుతో భారీ అవినీతి, స్కాములు జరిగాయని, రాజధాని నిర్మాణం ద్వారా కొందరి జేబులు నింపుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాజధాని అంశంలో కూటమి నాయకులు గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని సజ్జల గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ భూముల ఆధారంగా అందరికీ అందుబాటులో ఉండే రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనలో ఎలాంటి గందరగోళం లేదని, అమరావతిని రాజధానిగా తొలగిస్తున్నామని జగన్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అమరావతి భౌగోళిక పరిస్థితులు కూడా రాజధానికి పూర్తిగా అనుకూలంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు.

‘మావిగన్’ అంశాన్ని ప్రస్తావిస్తూ సజ్జల మరోసారి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రస్తుతం పెద్ద పరిశ్రమలు విశాఖపట్నానికి వెళ్తుంటే అమరావతికి ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై ఖర్చు చేస్తున్న మొత్తంలో కేవలం 10 శాతం వ్యయంతోనే సమర్థవంతమైన రాజధానిని నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News