E-PAPER

హరిపురం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News