వై7 న్యూస్ పలాస
పలాస, ఏప్రిల్ 6: పూరి జగన్నాథ్ ఆలయం దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న భక్తులకు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం పలాస సమీపంలోని నెమలి నారాయణపురం హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, అనంతరం లారీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారు ఒడిశా రాష్ట్రం పల్లఖేముండి గ్రామానికి చెందిన అచ్యుత నంద బరోడా (36), ముఖేష్ పాణిగ్రాహి (35), అమూల్య పాత్రో (44)గా గుర్తించారు.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.ఈ ఘటనపై కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Post Views: 16








