మంగపేట ;
మంగపేట కార్యదర్శిగా విధులు నిర్వహించిన సురేష్ బదిలీ అయిన సందర్భంగా, ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, సురేష్ తన పదవీకాలంలో ప్రజలకు అందించిన సేవలు, నిబద్ధత, కృషిని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ఉపాధ్యక్షులు కష్పముకుందం, గౌరవ సలహాదారులు చాదా మల్లయ్య, కల్లెబోయిన సురేష్, సయ్యద్ బాబా, ప్రచార కార్యదర్శి గగ్గూరి మహేష్‌తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 185









