E-PAPER

అగ్ని ప్రమాదంలో రెండు ఇల్లు దగ్ధం.. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం

దుమ్ముగూడెం::
కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంబంధించి రెండు ఇల్లు కాలిపోయిన సంఘటన మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి బుచ్చమ్మ కల్లూరి వెంకటమ్మ చెందిన రెండు ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వెంకటమ్మ చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమవుగా పక్కనే ఉన్నటువంటి బుచ్చమ్మకు చెందిన ఇంటికి మంటలు వ్యాపించాయి ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు నగదు పట్టా పుస్తకాలు ఆధార్ కార్డు సంబంధిత పత్రాలు కాలిపోయాయి.సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.సర్వం కోల్పోయి వీధిన పడ్డామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశాన్ని స్థానిక సర్పంచ్ నవీన్ సందర్శించి కుటుంబాలను ఓదార్పుతో అండగా ఉంటామని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News