వై 7 న్యూస్ పలాస ;
కాశీబుగ్గ–పలాస మున్సిపాలిటీ పరిధిలో ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం ఏపీ టిపిసి చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు.పనులు నాణ్యతతో పాటు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే గౌతు శిరీష చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 11








