వై 7 న్యూస్ పలాస ;
పలాస మండలం తర్లకోట గ్రామంలో ఆదివారం రాత్రి కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారి శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో నారి శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు.అలాగే సైబర్ క్రైమ్‌లపై అప్రమత్తంగా ఉండాలని, మైనర్ బాలికల వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.
Post Views: 9








