వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ చిన్న తిరుపతిలో భారీ విగ్రహాల నిర్మాణం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో 35 అడుగుల ఎత్తులో సూర్యభగవానుడు మరియు శివుడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు తెలిపారు.
గతంలో ఈ ఆలయంలో జరిగిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ప్రభుత్వం ఆలయాన్ని మూసివేసింది. ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
అయితే, భక్తులకు దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు.
Post Views: 10








