వై 7 న్యూస్ పలాస
రానున్న మున్సిపల్ ఎన్నికలను ప్రధాన ఎజెండాగా తీసుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం పలాసలోని టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ స్థాయి నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం గౌతు శిరీష ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
పార్టీ బలోపేతానికి ప్రతి స్థాయి నాయకులు కృషి చేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకు రావాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా గ్రామ, వార్డు స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేస్తే విజయం సాధ్యమవుతుందని నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








