వై 7 న్యూస్ పలాస
మందస మండలం జిల్లుండ పంచాయతీ డిమిలియా గ్రామంలో శనివారం ఓ వాగులో మృతదేహం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది.
వాగులో మృతదేహం కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మందస పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడు అంబుంగం గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రాథమిక సమాచారం లభించింది. అయితే మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 14








