E-PAPER

సారపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపాడు :

బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు. గ్రామాభివృద్ధి దిశగా కీలకమైన పనులను ప్రారంభిస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలను అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
సారపాకలో ఐటీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు రూ.7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్డిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా ఇటువంటి సదుపాయాలు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం గాంధీనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు జహంగీర్, జమీల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తదుపరి సారపాక పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో భద్రాచలం ఐటిడిఏ నిధులతో సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
కార్యక్రమాల అనంతరం కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ చక్రధరాచారి, ఐటీసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి చెంగల్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మహిముద్ ఖాన్, స్థానిక సర్పంచ్ శివరాం కిషోర్ నాయక్, ఉప సర్పంచ్ కన్నిదారి రమేష్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News