మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో టాస్క్ ఫోర్స్, కురవి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అక్రమ సారాయి తయారీకి ఉపయోగించే నల్లబెల్లం రవాణాను అడ్డుకున్నారు.
చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలిస్తున్న లారీని కురవి శివారు సోమ్లా తండా వద్ద ఆపి తనిఖీ చేయగా, అందులో 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సరుకు విలువ సుమారు రూ.8,00,000గా అధికారులు అంచనా వేశారు.
ఈ ఘటనకు సంబంధించి గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, లారీని సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్ఐ తాహేర్ బాబా, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ జయకుమార్, పోలీస్ సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.
Post Views: 25








