పినపాక
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జానంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని సర్పంచ్ ఉమామహేశ్వరి తెలియజేశారు. స్థానిక సెక్రటరీ కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద, ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాల్లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు, గ్రామస్తులకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు తెలిపారు. గ్రామస్తులు ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పేరం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 19








