వై 7 న్యూస్ పలాస
వజ్రపు కొత్తూరు మండలం ఒంకులూరు సమీపంలోని బర్రవాణి పేటలో ఆదివారం రాత్రి అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటి పిల్లను చూసిన కుక్కలు మొరుగడంతో అది భయంతో సమీపంలో ఉన్న మునగ చెట్టుపైకి ఎక్కి కూర్చుంది.
ఎలుగుబంటి పిల్ల అరుపులు విన్న గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. తల్లి ఎలుగుబంటి సమీపంలోనే ఉండి ఎవరిపై అయినా దాడి చేసే ప్రమాదం ఉందని భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
Post Views: 12








