పలాస;
పలాస నియోజకవర్గ నిరుద్యోగులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శుభవార్త అందించారు. ఈ నెల 20న స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కాశీబుగ్గలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
కాశీబుగ్గలోని సాయి శిరీష డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని 600కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. విద్యార్హతలను బట్టి ఆకర్షణీయమైన వేతనాలు అందించనున్నట్లు తెలిపారు.ఆసక్తి గల నిరుద్యోగులు 6301046329, 6301045132 నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Post Views: 56









